అక్టోబర్ లో హీరో విజయ్ దేవరకొండ ను సీక్రెట్ గా నిశ్సితార్ధం చేసుకున్న పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న ఆ విషయాన్ని ఎక్కడా లీక్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా మీడియా పసిగట్టేస్తుంది. ఇక రష్మిక-విజయ్ దేవరకొండ ల వివాహం ఫిబ్రవరిలో జరగబోతుంది. ఇరువురి పెద్దలు ముహుర్తాలు కూడా పెట్టేసారు.. ఫిబ్రవరిలో ఎడడుగుల బంధంతో రష్మిక-విజయ్ ఓ ఇంటివారు కాబోతున్నారనే ప్రచారం జరుగుతుంది.
తాజాగా రష్మిక మందన్న ఓ ఇంటర్వ్యూ లో తనకు వ్యక్తిగత విషయాలను బయటపెట్టడం ఇష్టం ఉండదు, ఆ విషయంలో చాలా సీరియస్ గా ఉంటాను, ఇంట్లో వాళ్లతో కెరీర్ గురించి పని గురించి మాట్లాడను, బయటికొస్తే ఫ్యామిలీ విషయాలు మాట్లాడను.. ఇక పెళ్లి వార్తలంటారా నేను ఈ వార్తలను ఇప్పుడే కన్ఫర్మ్ చెయ్యలేను. అలాగని వీటిని ఖండించనూ లేను. పెళ్లి గురించి ఎప్పుడు, ఎక్కడ మాట్లాడాలో అప్పుడు మాట్లాడతాను. పెళ్లి విషయమేదైనా ఖచ్చితంగా అందరితో షేర్ చేసుకుంటాను. అంతకుమించి ఇప్పుడే పెళ్లిపై ఏమి మాట్లాడలేను అంటూ తప్పించుకుంది.
ఇక సినిమా విషాయాలకొస్తే అన్ని అనుకున్నట్టుగా జరగవు. నాకు ఈ ఏడాది చాలా ప్రత్యేకం. ఐదు సినిమాలు విడుదలై ఆదరణ సొంతం చేసుకున్నాయి. ఇండస్ట్రీలో ఈ స్థానానికి రావాలంటే ఎంతో కష్టపడాలి.. అంటూ రష్మిక మందన్న ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాలను పంచుకుంది.