బిగ్ బాస్ సీజన్ 9 లో అగ్నిపరీక్షను దాటి హౌస్ లోకి కామనర్ గా ఎంట్రీ ఇచ్చి టాస్క్ ల్లో గట్టి పోటీ ఇచ్చే డిమోన్ పవన్ కి తెలివితేటలు తక్కువ. ఆటలో కండ బలమే కాదు స్మార్ట్ నెస్ కూడా ముఖ్యమే. కానీ పవన్ లో అది కొద్దిగా తక్కువే, రీతూ చౌదరి తో లవ్ ట్రాక్ వలన పవన్ కి లాభం కన్నా నష్టమే జరిగింది.
రీతూ తో ఫ్రెండ్ షిప్ చేసినా ఆమెను సపోర్ట్ చెయ్యడు, ఎవరైనా రీతూ ని అన్నా రీతూ వైపు స్టాండ్ తీసుకోడు అదే అతనికి మైనస్ అయ్యింది. పవన్ టాస్క్ ఆడినా అది రీతూ తో స్నేహం వల్ల బయటికి వెళ్ళలేదు. గత కొన్ని వారాలుగా నామినేట్ అయిన ప్రతిసారి డేంజర్ జోన్ కి వస్తున్నాడు. చివరి కెప్టెన్సీ టాస్క్ లో కళ్యాణ్ పవన్ ని ఓడించాడు. ఇక ఇప్పుడు టాప్ 5 లో ఉండడు అనుకున్న భరణి పవన్ కి టాస్క్ లో షాకిచ్చాడు.
టికెట్ టు ఫినాలే మూడో టాస్క్ లో డీమాన్ పవన్-భరణి మధ్య పోటీ పెట్టాడు బిగ్ బాస్. ఆ టాస్క్ లో భరణి బ్రిడ్జి కట్టేసి.. బ్యాగులు కూడా టేబుల్ మీద విసిరేసి గేమ్ గెలిచేశాడు. కానీ అప్పటికీ డీమాన్ బ్రిడ్జి కట్టలేకపోయాడు, అది అవ్వట్లేదు అంటూ అరుస్తున్నాడు. తనూజ ఇలా ట్రై చెయ్ అనగానే నువ్వు చెయ్ అన్నాడు, తనూజ వెళ్లి ఆ బ్రిడ్జి పై బల్ల సెట్ చేసింది. దానితో పవన్ షాకయ్యాడు.
అసలు భరణి టాప్ 5 లో ఉండడు అనుకుంటే ఈ టాస్క్ లో బలమైన పోటీతో పవన్ కి షాకిచ్చి గెలిచి టాప్ 5 కి దగ్గరైనట్టే కనిపిస్తుంది ప్రస్తుత సీన్.