రీసెంట్ గా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఓ కొత్త జంట హనీమూన్ అంటూ సీక్రెట్ గా మాల్దీవులకు చెక్కసి అక్కడ సముద్రపు అలల నడుమ ఏంజాయ్ షేర్ చేసారు. ఆ కొత్త జంట ఎవరో కాదు రాహుల్ సిప్లిగంజ్-హరణ్య రెడ్డి. గత నెల అంటే నవంబర్ 27 న అంగరంగ వైభంగా రాహుల్ తను ప్రేమించిన హిరణ్య రెడ్డి మెడలో మూడు ముళ్ళు వేసి ఏడడుగులు నడిచారు.
తన కాబోయే భార్య హరణ్య రెడ్డి కోసం ఆమె ఫెవరెట్ క్రికెటర్ చాహల్ ని తీసుకొచ్చి ఆమెను సర్ ప్రైజ్ చేసాడు రాహుల్ సిప్లిగంజ్, ఇక రాహుల్ వెడ్డింగ్ రిసెప్షన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ఇలా చాలామంది రాజకీయనాయకులు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
అయితే వివాహమైన వారం లోపే రాహుల్ సిప్లిగంజ్ జంట సైలెంట్ గా హనీమూన్ చెక్కేశారు. సెలబ్రిటీస్ కి బెస్ట్ వెకేషన్ స్పాట్ అయిన మాల్దీవుల్లో రాహుల్ సిప్లిగంజ్, హరణ్య రెడ్డిలు ఎంజాయ్ చేస్తూ డ్రింక్ తాగుతూ సముద్రంలో ఉన్న పిక్స్ షేర్ చేసారు. దానితో మాల్దీవులకు చెక్కేసిన కొత్త జంట అంటూ నెటిజెన్స్ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.