పాన్ ఇండియా స్టార్ యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ `టాక్సిక్` చిత్రాన్ని భారీ కాన్వాస్ పై తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా మొదలైన నాటి నుంచి గీతూ మోహన్ దాస్ ప్రతీ ప్రేమ్ ను చెక్కుతున్నారు. దీంతో షూటింగ్ కూడా నెమ్మదిగా జరుగుతుంది. ఇప్పటికే గ్లింప్స్ కూడా రిలీజ్ అయ్యాయి. వాటికి పెద్దగా రెస్పాన్స్ రాలేదు కానీ? యశ్ పై కాన్పిడెన్స్ తో సినిమాపై మాత్రం అంచనాలు పతాక స్థాయిలో ఉన్నాయి. `కేజీఎఫ్` ప్రాంచైజీ తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా కావడంతోనే ఈ రేంజ్ లో బజ్ క్రియేట్ అవుతుంది.
షూటింగ్ సహా అన్ని పనులు పూర్తిచేసి 2026 మార్చి లేదా? సమ్మర్ లో రిలీజ్ చేయాలన్నది ప్లాన్. ఇప్పటికే రిలీజ్ విషయాన్ని కూడా మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు? అన్నది ఇంత వరకూ సరైన క్లారిటీ లేనదు. తొలుత అనిరుద్ సంగీతం అందిస్తున్నాడని ప్రచారం జరిగింది. కానీ గ్లింప్స్ కి రవి బస్రూర్ ఆర్ ఆర్ అందించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో పాటలకు అనిరుద్..బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి రవి సహాకారంగా ఉంటానే ప్రచారం జరిగింది.
కానీ తాజాగా సమీకరణాలు మారుతున్నట్లు తెలుస్తోంది. సంగీతానికి సంబంధించిన మొత్తం బాధ్యతలు రవి బస్రూర్ కి అప్పగించాలని యశ్ భావిస్తున్నాడుట. ఈ మధ్య రెగ్యలర్ గా యశ్ అతడికి టచ్ లో ఉంటున్నట్లు కన్నడ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో సంగీత దర్శకుడి విషయంలో డైలమా మొదలైంది. సినిమా రిలీజ్ వచ్చే ఏడాదని ప్రకటించినా ఇంత వరకూ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అన్నది క్లారిటీ లేకపోవడం సర్వత్రా చర్చనీయంశంగా మారింది.
సినిమా నుంచి ఇంత వరకూ ఎలాంటి రిలికల్ సాంగ్స్ కూడా రిలీజ్ కాలేదు. ఇప్పుడోమో మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మీడియా కథనాలు అంతకంతకు వేడెక్కిస్తున్నాయి. మరి ఆ ఛాన్స్ ఎవరు దక్కించుకుంటున్నారు? అన్నది మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకూ గానీ క్లారిటీ రాదు. రవి బస్రూర్-అనిరుద్ ఇద్దరు సౌత్ లో బిజీ మ్యూజిక్ డైరెక్టర్లే. తెలుగు, తమిళ సినిమాలకు పని చేస్తున్నారు.