పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సందీప్ వంగ ఎట్టకేలకు స్పిరిట్ షూటింగ్ ని రీసెంట్ గానే స్టార్ట్ చేసారు. హైదరాబాద్ లో ప్రభాస్ పై యాక్షన్ సీక్వెన్స్ ని సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్నారు. అయితే స్పిరిట్ ఓపెనింగ్ లో ప్రభాస్ ని దాచేసి ఆయన పిక్స్ రివీల్ చెయ్యలేదు, సందీప్ వంగ.
అలాగే ప్రభాస్ లుక్ టెస్ట్ ని కూడా సందీప్ వంగ చాలా సైలెంట్ గా చేసేసారు. ఓ ఆరు నెలల పాటు ప్రభాస్ పబ్లిక్ లో కనిపించకూడదనే రూల్ పెట్టారని, ప్రభాస్ ఆరు నెలల పాటు తన లుక్ రివీల్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారనే టాక్ నడిచింది. అదే సమయంలో స్పిరిట్ షూటింగ్ జరుగుతున్న ప్లేస్ నుంచి ప్రభాస్ పోలీస్ లుక్ లో సందీప్ రెడ్డి వంగతో మాట్లాడుతున్న సీన్ లీకైంది.
స్పిరిట్ అలా షూటింగ్ కి సెట్ పైకి వెళ్లిందో లేదో ఇలా లీకులు షురూ అంటూ ఆ లీకెడ్ ఫొటో ని చాలామంది ట్రేడ్ చేస్తున్నారు. అయితే స్పిరిట్ సెట్ నుంచి లీకైన పిక్ పై సందీప్ అండ్ టీమ్ ఎలాంటి యాక్షన్ తీసుకోకవడానికి రెడీ కాకపోవడమే అందర్నీ విస్మయానికి గురి చేస్తుంది. ఏది ఏమైనా ఆరడుగుల కటౌట్ పోలీస్ డ్రెస్ వేస్తె సింహమే అంటూ ప్రభాస్ పోలీస్ లుక్ లో కనిపించిన తీరుకి ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.