నకిలీ మద్యం కేసులో కీలక నిందితులుగా ఉన్న జోగి బ్రదర్స్ గా పిలవబడే మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాము పోలీసులు కష్టడీలోకి విషయం విదితమే. నకిలీ మద్యం తయారీ, రవాణా, పంపిణీ వ్యవహారంపై జరుగుతున్న విచారణలో భాగంగా ఈ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ తర్వాత వారిని తంబళ్లపల్లి కోర్టులో హాజరుపరిచారు.
తాజాగా కోర్టు జోగి బ్రదర్స్ కి 14 రోజుల రిమాండ్ విధించింది. రిమాండ్ ఉత్తర్వుల ప్రకారం జోగి బ్రదర్స్‌ను అధికారులు నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు.