2026 సంక్రాంతి రిలీజ్ లు ఫిక్సైన సంగతి తెలిసిందే. ప్రభాస్ నటిస్తోన్న `రాజాసాబ్`, చిరంజీవి నటిస్తోన్న `మనశంకర వరప్రసాద్ గారు`, రవితేజ నటిస్తోన్న `భర్త మహాశయులకు` లాంటి చిత్రాలతో నయా స్టార్లు అలరించడానికి రెడీ అవుతున్నారు. ఈ మూడు చిత్రాలు కామెడీ కం ఫ్యామిలీ ఎంటర్ టైనర్లే. యాక్షన్ ఎలివేషన్ కు పెద్దగా ఆస్కారం లేని కంటెంట్ గల చిత్రాలు. మారుతి తెరకెక్కిస్తోన్న `రాజాసాబ్` కామెడీ హారర్ థ్రిల్లర్. కామెడీ ప్రధానంగా సాగుతుంది.
అలాంటి పాత్ర పోషించాలని ప్రభాస్ మారుతిని పిలిచి మరీ అవకాశం ఇచ్చిన చిత్రం. ఇప్పటి వరకూ ప్రభాస్ నటించిన సినిమాలన్నీ యాక్షన్ తోనే హైలైట్ అయ్యాయి. కాబట్టి రాజాసాబ్ లో యాక్షన్ సన్నివేశాలను అభిమానుల ఆశించాల్సిన పనిలేదు. ఒకే వేళ ఉన్నా? అక్కడక్కడా ఉంటాయి. అందులోనూ హాస్యం పండే అవకాశం ఉంది. శంకర వరప్రసాద్ గురించైతే చెప్పాల్సిన పనిలేదు. పక్కా కామెడీ చిత్రమని ప్రారంభానికి ముందే చెప్పేసారు.
ఈనేపథ్యంలో ఈ సినిమాలో కూడా యాక్షన్ కు పెద్దగా స్కోప్ ఉండదు. చిరు కామెడీ టైమింగ్ మాత్రమే హైలైట్ అవుతుంది. దర్శకుడు అనీల్ రావిపూడి కూడా ఆ ట్రాక్ పైనే ప్రధానంగా దృష్టి పెట్టి పని చేస్తున్నాడు. అలాగే మాస్ రాజా రవితేజ నటిస్తోన్న `భర్త మహాశయులు` కూడా పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్. టైటిల్ తోనే ఇదో కుటుంబ కథా చిత్రమని తేలిపోయింది. భార్యా భర్తల బందం కథలో మెయిన్ పాయింట్ గా తెలుస్తోంది.
ఆ చుట్టూ రవితేజ పాత్రను కామిక్ గా మలిచి కిషోర్ మార్క్ ఎంటర్ టైనింగ్ గా అలరించబోతున్నారు. ఇందులోనూ యాక్షన్ సన్నివేశాలకు పెద్దగా ఆస్కారం లేదని తెలుస్తోంది. ఆద్యంతం వినోదంతో కూడిన కథనంతోనే సాగనుంది. వరుస ప్లాప్ ల నేపథ్యంలో రవితేజ కూడా యాక్షన్ సన్నివేశాలకు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చినట్లు లేదని చెప్పొచ్చు. అలాగే యువ హీరో నవీన్ పొలిశెట్టి నటిస్తోన్న `అనగనగా ఒక రాజు` కూడా హిలేరియస్ ఎంటర్ టైనర్ గా రూపొందిందే. ఇలా నాలుగు చిత్రాలు కామిక్ గానే హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈ సంక్రాంతి యాక్షన్ ప్రియులకు మాత్రం చప్పగానే ఉంటుందని తెలుస్తోంది.