హీరో రామ్ లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం గత గురువారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. మంచి ప్రమోషన్స్ అందుకు తగిన కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా కి అటు ప్రేక్షకులు ఇటు సినీవిమర్శకులు ఓవరాల్ గా సూపర్ హిట్ రెస్పాన్స్ చూపించారు. దానితో రామ్ గట్టెక్కేసాడు. చాలా రోజుల తర్వాత హిట్ కొట్టాడు అనుకున్నారు.
తీరా చూస్తే ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ కి వస్తున్న కలెక్షన్స్ ని కంపేర్ చేసి చూస్తే అందరూ షాకవుతున్నారు. టాక్ కి లెక్కలకి సంబంధం లేదు అంటున్నారు. రామ్ అమెరికా నుంచి వచ్చాక ఏమైనా థియేట్రికల్ టూర్ చేస్తే థియేటర్స్ ఆక్యుపెన్సీ పెరుగుతుంది.
వచ్చే శుక్రవారం నుంచి అఖండ 2 థియేటర్స్ ని ఆక్యుపై చేస్తుంది. అప్పుడు రామ్ ఏం చేసినా సూన్యం, అఖండ 2 విడుదలకి కొద్దిగా గ్యాప్ ఉంటె రామ్ సేవ్ అయ్యేవాడే. కానీ వెంటనే అంత మాస్ ఎంటర్టైనర్ ఆంధ్ర కింగ్ తాలూకా పాలిట శాపంలా తగిలింది. అఖండ 2 వస్తే ఆంధ్ర కింగ్ తాలూకా సర్దుకోవాల్సిందే.