అక్కినేని యంగ్ హీరో అఖిల్ సక్సెస్ కోసం పోరాడుతున్నాడు. ఏజెంట్ తర్వాత ఆచి తూచి మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో లెనిన్ స్టార్ట్ చేసాడు. అఖిల్ బర్త్ డే కి వదిలిన గ్లింప్స్ చూసి అక్కినేని అభిమానులు సంబరపడ్డారు. అఖిల్ విలేజ్ వింటేజ్ లుక్ కూడా అభిమానులను ఇంప్రెస్స్ చేసింది.
పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ తెరకెక్కుతున్న లెనిన్ మూవీ షూటింగ్ పై క్లారిటీ లేదు అదే సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ. ఈలోపు లెనిన్ రీ షూట్ జరుపుకుంటుంది, కొన్ని సన్నివేశాలు సంతృప్తిగా లేని కారణంగా దర్శకుడు రీ షూట్ చేస్తున్నారనే వార్త అభిమానులను కలవరపెడుతుంది.
అఖిల్ గత సినిమాల రిజల్ట్ దృష్టిలో పెట్టుకుని మురళి అబ్బూరి లెనిన్ విషయంలో అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అందుకే లెనిన్ లోని కొన్నిసన్నివేశాలు పూర్తి శాటిస్ ఫెక్షన్ లేక మళ్ళీ రీ షూట్ చేస్తున్నారట. అది చూసి అఖిల్ లెనిన్ కి కూడా తప్పని తిప్పలు అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.