మలయాళ క్రేజీ హీరో దుల్కర్ సల్మాన్ - భాగ్యశ్రీ బోర్సే జంట గా సెల్వమణి సెల్వరాఘవన్ తెరకెక్కించిన బైలింగువల్ మూవీ కాంత. ఈ చిత్రం ఎన్నో అంచనాల నడుమ నవంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో కాంత తడబడింది. రెండో రోజుకే కాంత థియేటర్స్ లో సైలెంట్ అయ్యింది.
అయితే ఈచిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని దుల్కర్ సల్మాన్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి హిట్ అయినా లేదంటే ప్లాప్ అయినా నాలుగైదు వారాలకే కాదు కాదు నెల లోపే ఓటీటీ లోకి వస్తున్న ఈ రోజుల్లో కాంతా కూడా నెలతిరక్కుండానే ఓటీటీ స్ట్రీమింగ్ లోకి రాబోతుంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కాంత డిజిటల్ హక్కులను ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకోగా.. ఇప్పుడు ఈ చిత్రాన్ని డిసెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ చెయ్యబోతున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. సో థియేటర్స్ లో మిస్ అయిన వారు కాంత ను ఓటీటీలో వీక్షించేయ్యండి.