నటసింహా నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా చాలా బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. కానీ ఇప్పటివరకూ పాన్ ఇండియాలో బాలయ్య కోసం ఒక స్లాట్ ఏదీ స్థిరంగా లేదు. ఆయన తెలుగు మాస్ ఆడియెన్ కోసం మాత్రమే సినిమాలు చేస్తారనే అభిప్రాయం బలంగా ఉంది. అయితే ఇప్పుడు ప్రతిదీ మారబోతోంది. ఎన్బీకే పాన్ ఇండియా డ్రీమ్ ని ఫుల్ ఫిల్ చేసేందుకు బోయపాటి `అఖండ 2`ని తెరకెక్కించారని ఫిలింసర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రచార వేదికలపై బాలయ్య కాన్ఫిడెన్స్ కూడా దీనిని ధృవీకరించింది.
ఇదే విషయంపై చిత్ర నిర్మాతలు రామ్ ఆచంట, గోపినాథ్ ఆచంట మాట్లాడుతూ..``ఈ సినిమాలో కంటెంట్ ఇండియా లెవల్లో కనెక్టవుతుందని నమ్ముతున్నట్టు`` తెలిపారు. ముఖ్యంగా సనాతన ధర్మం ఎలిమెంట్ ఉత్తరాదినా కనెక్టవుతుంది. దీనికి భాషా సరిహద్దులు లేవని భావిస్తున్నాం. ముఖ్యంగా ఎన్బీకే అఘోరా పాత్ర హైలైట్ గా ఉంటుంది. సెకండాఫ్ లో ఇది బిగ్గెస్ట్ సర్ ప్రైజ్ గా ఉంటుందని కూడా నిర్మాతలు తెలిపారు.
ఏదైనా సినిమా కేవలం మాస్ లేదా అభిమానుల వరకూ నచ్చితేనే సరిపోదు. అన్ని సెక్షన్ల ఆడియెన్ కి నచ్చినప్పుడే మంచి వసూళ్లు సాధ్యమవుతాయని కూడా `అఖండ 2` నిర్మాతలు తెలిపారు. బోయపాటి ఈ చిత్రాన్ని అన్ని వర్గాల కోసం తెరకెక్కించారని అన్నారు. అఖండ 2 డిసెంబర్ 5న అత్యంత భారీగా విడుదలవుతోంది. ఈసారి ఉత్తరాదినా భారీ ప్రమోషన్స్ తో విడుదల చేస్తున్నామని నిర్మాతలు వెల్లడించారు.