పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ విడుదలకు ఇంకా 40 రోజుల సమయముంది. ఇప్పటికే రాజా సాబ్ నుంచి టీజర్, ట్రైలర్, ఫస్ట్ సింగిల్ వదిలారు. రాజా సాబ్ ప్రమోషన్స్ అమెరికాలో కూడా నిర్వహించనున్నారు. అయితే రీసెంట్ గా వదిలిన రెబల్ సాబ్ సాంగ్ ఎంతగా ట్రెండ్ అయినా పెద్ది చికిరి చికిరి సాంగ్ ముందు తేలిపోయింది.
అందుకే రాజా సాబ్ సెకండ్ సింగిల్ పై అందరిలో ముఖ్యంగా అభిమానులల్లో మంచి క్యూరియాసిటీ నడుస్తుంది. అయితే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అఖండ తాండవం రిలీజ్ ప్రమోషన్స్ లో ఉన్నారు. అందుకే అఖండ 2 రిలీజ్ తర్వాతే రాజా సాబ్ సెకండ్ సింగిల్ వదిలేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారా. సో అఖండ 2 విడుదలయ్యే వరకు రాజా సాబ్ సెకండ్ సింగల్ ఉండదన్నమాట.
రాజా సాబ్ సెకండ్ సింగిల్ ముగ్గురు హీరోయిన్స్ నిధి అగర్వాల్, ఇక మాళవిక మోహనన్, రద్దీ కుమార్ తో ప్రభాస్ మెలోడీ సాంగ్ లో కనిపిస్తారని తెలుస్తుంది. మారుతి ఈ సాంగ్ ఎంత రిచ్ గా ప్లాన్ చేసారో చూడాలి.