సమంత దర్శకుడు రాజ్ నిడిమోరు తో డేటింగ్ లో ఉంది అనే ప్రచారాన్ని నిజం చెయ్యబోతుందా, రాజ్ నిడిమోరు ని సమంత వివాహమాడబోతుందా.. అదే సోషల్ మీడియా రిపోర్ట్స్, రాజ్ నిడిమోరు భార్య శ్యామిలిదే సోషల్ మీడియా పోస్ట్ చూస్తే నిజమనిపిస్తుంది.
సమంత తనకిష్టమైన ఈషా ఫౌండేషన్ లోనే ఈరోజు డిసెంబర్ 1 న రాజ్ నిడిమోరు ని వివాహం చేసుకోబోతుంది. కొద్దిమంది సన్నిహితులు,రాజ్ నిడిమోరు ఫ్యామిలీ సమక్షంలో సమంత రాజ్ తో ఏడడుగులు నడవబోతుంది అనే వార్త దావానలంలా వ్యాపించింది. తనకి బాదొచ్చినా, సంతోషమొచ్చినా, కష్టమొచ్చినా ఈషా ఫౌండేషన్ కి వెళ్లే సమంత తన పెళ్లి కోసం అదే ప్లేస్ ని ఎంచుకుంది.
ఇక రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామిలిదే బరితెగించిన వ్యక్తులు దానికి తగ్గట్టుగానే వ్యవహరిస్తారంటూ పెట్టిన పోస్ట్ కి సమంత రాజ్ నిడిమోరు ని వివాహం చేసుకోబోతుంది అనే వార్తలకు బలం చేకూరేలా చేసాయి. మరి సమంత తన రెండో పెళ్లిని ఎందుకింత సీక్రెట్ గా చేసుకోవాలి, ఏ విషయమైనా ఓపెన్ గా ధైర్యంగా చెప్పొచ్చు కదా అనేది నెటిజెన్స్ వాదన.