బిగ్ బాస్ సీజన్ 9 లో 12 వ వారం శనివారం ఎపిసోడ్ పై ప్రేక్షకులు ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. కారణం సంజన ను నాగార్జున బయటికి పంపిస్తారని అనుకున్నారు. రీతూ చౌదరిపై ఇష్టమొచ్చినట్టుగా పర్సనల్ గా టార్గెట్ చెయ్యడంతో నాగార్జున, బిగ్ బాస్ సంజనను హౌస్ నుంచి పంపిస్తారు అనుకుంటే ఆమెను బ్రతిమిలాడి భయపెట్టి రీతూ కి సారీ చెప్పించడమే ఆడియన్స్ కి అస్సలు నచ్చలేదు.
ఈరోజు సండే ఎపిసోడ్ లో సరదాగా హౌస్ మేట్స్ తో ఆటలాడించిన నాగార్జున మీరు ఈ హౌస్ లో ఉండేందుకు ఎవరు డిసర్వ్ కాదు, ఎవ్వరు ఉండడం కరెక్ట్ కాదు అనుకుంటున్నారో చెప్పమని ఫ్యామిలీ ట్రీ పై ఫొటోస్ పెట్టగా హౌస్ మేట్స్ మొత్తం సంజన పేరే చెప్పారు. ఆమె అలా ఆమె ఇలా అంటూ సంజన కు యాంటీ గా ఓటేశారు.
ఆమె మాట తీరు అదుపులో పెట్టుకుంటే సంజన మంచి ప్లేయర్ అంటూ బిడ్డ ఇమ్మాన్యుయేల్ కూడా సంజన కు వ్యతిరేఖంగా మాట్లాడడం నిజంగా షాకిచ్చింది. ఇక ఈవారం దివ్య నిఖిత ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తుంది. డబుల్ ఎలిమినేషన్ లో భాగముగా సుమన్ శెట్టి ఎలిమినేట్ అయినట్లుగా టాక్.