బంగారం కన్నా వేగంగా పెరుగుతుంది వెండి ధర. గోల్డ్ రేట్ కూడా అందనంత ఎత్తులో ఉంటే దానికి డబుల్ రేట్లు కేజీ సిల్వర్ ధర కనిపిస్తుంది. 12 నెలల కాలంలో వెండి ధర కేజీకి రూ.లక్ష పెరిగింది. గత ఏడాది ఇదే సమయంలో రూ.98 నుంచి లక్ష ధర ఉన్న సిల్వర్ ఇప్పుడు రూ.1.96 వేలు పలకడం చూసి సిల్వర్ రూ.5 లక్షల ధర పలికినా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటున్నారు.
కారణం ఎక్కువమంది వెండిలో పెట్టుబడి పెట్టడం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో వెండి ధర రికార్డ్ స్థాయిలో పెరిగిపోయింది. అయితే వెండి ధర ఎంతగా పెరిగినా.. ధర తగ్గుతుంది అంటే పది పది అంటూ వేలల్లో తగ్గిపోతుంది. అదే గోల్డ్ అయితే పెరిగితే వేలల్లో, తగ్గితే వందల్లో అన్నట్టుగా ఉంటుంది.
అయితే డాలర్ రేటు బట్టి వెండి ధరలు పైపైకి పోతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే చాలామంది సిల్వర్ ని పెట్టుబడిగా మార్చడంతో కిలో వెండి ధర ఈ రేంజ్ లో పెరిగింది, రాబోయే రోజుల్లో వెండి ధర ఐదు లక్షలు పలికినా పలకొచ్చు అనే మాట సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసింది.