ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 శనివారం ఎపిసోడ్ కోసం అందరూ వెయిటింగ్. ఈ వారంలో సంజన, కళ్యాణ్, పవన్ లు పడిన గొడవలకు నాగార్జున ఎవరికి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారు, దివ్య ను గత వారం ఎలిమినేట్ అవ్వకుండా కాపాడిన బిగ్ బాస్ యాజమాన్యం ఈసారి ఎలా ఎలిమినేట్ చెయ్యరో చూస్తాం అంటున్నారు బుల్లితెర ఆడియన్స్.
సంజన రీతూ చౌదరిని హౌస్ లో పర్సనల్ గా టార్గెట్ చేసింది. సంజనను నామినేట్ చేసిన రీతూ ని నువ్వు పవన్ తో కలిసి కూర్చుంటున్నావ్, మీ ఇద్దరిది చుడడానికి చిరాగ్గా ఉంది అంటూ సంజన నోరు పారేసుకుంది. ఆ విషయంలో సంజనను హౌస్ మేట్స్ ముఖ్యంగా ఇమ్మాన్యుయేల్ తప్పుబట్టారు.
ఇక అదే నామినేషన్స్ లో డిమోన్ పవన్, కళ్యాణ్ లు రీతూ విషయంలో కొట్టుకునే వరకు వెళ్ళారు. కళ్యాణ్ ని పవన్ మెడ పట్టుకొబోయాడు. మరి ఈ వారం ఈ ముగ్గురికి నాగార్జున రెడ్ కార్డు చూపించి వార్నింగ్ ఇస్తారనే క్యురియాసిటితో జనాలు ఉన్నారు. మరోపక్క దివ్య ఎలిమినేషన్ పై ఆడియన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.