హరి హర వీరమల్లు తర్వాత రాజా సాబ్ తో జనవరిలో ఆడియన్స్ ముందుకు రాబోతున్న క్యూట్ అండ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇక రాజా సాబ్ ప్రమోషన్స్ లో రచ్చ చెయ్యడానికి రెడీ అవుతుంది. రాజా సాబ్ లో గ్లామర్ గర్ల్ గా ప్రభాస్ సరసన ఆడిపాడబోతుంది. ఈ చిత్రం హిట్ అవాలని అమ్మడు చాలానే హోప్స్ పెట్టుకుంది.
ఇక సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ పోస్ట్ లు చూస్తే మతిపోతుంది. అంత చక్కటి గ్లామర్ షో చేస్తూ బ్యూటిఫుల్ పిక్స్ ని షేర్ చేస్తుంది. తాజాగా డార్క్ పర్పుల్ కలర్ శారీ లో గ్రీన్ బ్లౌజ్ లో కుందనపు బొమ్మలా రెడీ అయిన నిధి అగర్వాల్ తన మొహం పై నెమలి పింఛాన్ని పెట్టుకుని అందంగా కనిపించింది.
అందానికి అందం, అణుకువగా అందులోనే గ్లామర్ షో తో అద్దరగొట్టేసింది. మరి నిధి అగర్వాల్ నమ్మకాన్ని రాజా సాబ్ వమ్ము చేయకుండా హిట్ ఇస్తే అమ్మడు సుడి తిరిగినట్టే.. చూద్దాం నిధి లక్ ఎలా ఉండబోతుందో అనేది..