ప్రస్తుతం కెరీర్ కొలాప్స్ అవుతున్న తరుణంలో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన హీరో రాజ్ తరుణ్ కి ఓటీటీలోను సక్సెస్ కానరాలేదు. చిరంజీవ అంటూ ఆహ లో కనిపించిన రాజ్ తరుణ్ కి ఆ చిత్రం డిజప్పాయింట్ రిజల్ట్ ఇచ్చింది. ఆతర్వాత రెండు వారాల గ్యాప్ లోనే పాంచ్ మినార్ అంటూ థియేట్రికల్ రిలీజ్ చెయ్యగా ఆ చిత్రము నిరాశపరిచే రిజల్ట్ ఇచ్చింది.
పాంచ్ మినార్ థియేటర్స్ లోకి వచ్చిన విషయమే ప్రేక్షకులకు పెద్దగా తెలియదు, కారణం ప్రమోషన్స్ అంతంతమాత్రము, ఇక విడుదలయ్యాక సినిమాకి నెగెటివ్ టాక్, నెగెటివ్ రివ్యూస్. పాంచ్ మినార్ థియేటర్స్ లో విడుదలైన వారానికే ఓటీటీ లో ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతైంది.
ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా రాజ్ తరుణ్ పాంచ్ మినార్ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి తీసుకురావడంతో అందరూ సర్ ప్రైజ్ షాకవుతున్నారు.