బిగ్ బాస్ సీజన్ 9 ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకుంది. ఈ వారమంతా బిగ్ బాస్ ఓల్డ్ కంటెస్టెంట్స్ తో హౌస్ లో ఉన్న తొమ్మిదిమంది పోరాడి చివరి కెప్టెన్సీ కంటెండర్లు గా నిలిచారు. బాస్ సీజన్ లో లాస్ట్ కెప్టెన్ గా డిమోన్ పవన్ నిలిచినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ వారం ఎలిమినేషన్ పై అందరిలో చాలా క్యూరియాసిటీ నడుస్తుంది.
కారణం అందరూ టాప్ 5 కంటెస్టెంట్స్ లా టఫ్ ఫైట్ ఇచ్చినవారే. తనూజ, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, డిమోన్ పవన్, సంజన, దివ్య, భరణి, సుమన్ శెట్టి లు నామినేషన్స్ లో ఉన్నారు. రీతూ కెప్టెన్ కాబట్టి ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఈ వారం తనూజ, కళ్యాణ్ వోటింగ్ లో రోజుకొకరు టాప్ ప్లేస్ లో ఉంటూ టఫ్ ఫైట్ ఇచ్చుకున్నారు.
ఇక టాప్ 3 కి వచ్చే సరికి ఇమ్మాన్యుయేల్ ఉంటే ఆతర్వాత స్తానాల్లో భరణి, సంజన ఉన్నారు. చివరి గా డేంజర్ జోన్ లో డిమోన్ పవన్, దివ్య, సుమన్ శెట్టి ఉన్నారు. అందులో పవన్ కెప్టెన్ అయ్యాడు కాబట్టి.. అతను ఎలిమినేట్ అవ్వడు. ఇక దివ్య, సుమన్ శెట్టి లలో ఎవరో ఒకరు ఇంటికెళ్లిపోవాల్సిందే. డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరూ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది.