ప్రస్తుతం యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూస్ తో రచ్చ రచ్చ చేస్తున్న పాట ఏది అంటే అది రామ్ చరణ్ పెద్ది చికిరి చికిరి పాటే. చిన్నవాళ్లు లేదు, స్కూల్ పిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేదు, యూత్ ఇలా మొత్తం చికిరి చికిరి పాట కు డాన్స్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఈ పెద్ది చికిరి చికిరి పాటను పెద్ద హిట్ చేసారు.
చికిరి చికిరి పాట ను రామ్ చరణ్ కొండల్లో గుట్టల్లో, రోడ్ల పై డాన్స్ చేస్తూ చాలా సాహసమే చేసారు. తాజాగా ఈ పాట కోసం రామ్ చరణ్ మాములుగా కష్టపడలేదు. ఆ విషయాన్ని చికిరి చికిరి సాంగ్ మేకింగ్ విడుదల చేసి ఈ పాట కోసం ఎంతగా కష్టపడ్డారో చూపించారు. 45 నిముషాలు ట్రెక్కింగ్ చేసి, ఎత్తయిన కొండలు ఎక్కి మరీ రిస్కీ లొకేషన్లలో ఈ పాట ను షూట్ చేసుకుని వచ్చారు.
ఎత్తైన కొండ మీద రామ్ చరణ్ డాన్స్ చేస్తూ చాలా రిస్కీ గా డాన్స్ చేసాడు. ఆ మేకింగ్ వీడియో చూస్తే మాత్రం అమ్మో అనిపించకమానదు. మరి దర్శకుడు బుచ్చిబాబు రెహమాన్ మ్యూజిక్ డైరెక్షన్ లో రామ్ చరణ్ డాన్స్ స్టెప్స్ తో ఈ చికిరి చికిరి పాటను ట్రెండ్ అయ్యేలా చేసి సినిమా విడుదల అయ్యేవరకు ఈ పాట తో ఎంజాయ్ చెయ్యాలని వదిలేసినట్టుగా ఉంది. ఇక ఆ పాట మేకింగ్ వీడియో చూసాక 100 మిలియన్స్ వ్యూస్ ఊరికే రావు.. ఇంత కష్టపడకపోతే అంటూ కామెంట్లు పెడుతున్నారు మ్యూజిక్ లవర్స్.