నిజమే బాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటివరకు సక్సెస్ కోసం తెగ పోరాడిన రకుల్ ప్రీత్ కి ఫైనల్ గా దే దే ప్యార్ దే 2 తో హిట్ దొరికింది. అజయ్ దేవగన్ తో కలిసి రకుల్ ప్రీత్ గ్లామర్ గా నటించిన ఈ చిత్రం 100 కోట్ల మార్క్ దాటిపోయింది. అలా దే దే ప్యార్ దే 2 తో ఫైనల్లీ రకుల్ బాలీవుడ్ లో సక్సెస్ ఖాతా తెరిచింది.
ఇప్పటివరకు హిందీలో హిట్ కొట్టని రకుల్ కి ఈ హిట్ బిగ్ రిలీఫ్ అంటే కాదు.. ఆమెకు అప్పుడే చాలా సినిమా ప్రాజెక్ట్ తలుపు తడుతున్నాయనే వార్తలు ఆమె అభిమానులను సర్ ప్రైజ్ చేస్తుంది. ఒక్క హిట్ చాలు కెరీర్ టర్న్ అవ్వడానికి అంటూ వారంతా మట్లాడుకుంటున్నారు.
ప్రస్తుతం లేడీ ఒరింటెడ్ చిత్రాల కోసం రకుల్ ని చూస్ చేసుకుంటారట దర్శక నిర్మాతలు. మరి ఈ దే దే ప్యార్ దే 2 హిట్ ని రకుల్ ఇప్పటివరకు కంటిన్యూ చేస్తుందో చూద్దాం. ఈ లేడీ లక్ కి ఇంకెంతమంది సీనియర్ లకు కేరాఫ్ అవుతుందో చూద్దాం.