బిగ్ బాస్ సీజన్ 9హౌస్ లో టాప్ 5 లో ఎవరు ఉంటారు అనేది స్పష్టమవుతున్నా ఈ సీజన్ కప్ ఎవరు తీసుకుంటారో అనే విషయంలో నలుగురు పేర్లు వినబడుతున్నాయి. అందులో తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ మధ్యన బిగ్ బాస్ సీజన్ 9 కప్ ఉండబోతుంది అనేది స్పష్టమయ్యింది. నామినేషన్స్ లో ఉన్నప్పుడు తనూజ vs కళ్యాణ్ పడాల అన్నట్టుగా బుల్లితెర ప్రేక్షకులు ఓట్లు గుద్దుతున్నారు.
ఇమ్మాన్యుయేల్ కొన్ని వారాలుగా నామినేషన్స్ లోకి రాకపోవడం అతని మైనస్ అయ్యి కూర్చుంది. ఇకపోతే ప్రస్తుతం 12 వ వారం చివరి కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ హౌస్ మేట్స్ హౌస్ లోకి వచ్చి ఇప్పుడు ఉన్న తొమిదిమందిపై పోటీపడుతున్నారు. అలా కళ్యాణ్ పడాల ఇప్పటికే కంటెండర్ గా నిలిచాడు.
అయితే పాత కంటెస్టెంట్ గౌతమ్ అందరిని కూర్చోబెట్టి మీకు హౌస్లో ఎవరు ఇష్టం, ఎవరు మీకు పోటీ అని అడిగితే.. భరణి నాకు తనూజ అంటే ఇష్టమన్నాడు, కళ్యాణ్ పడాల మళ్లీ తనూజ వల్లే నేను గేమ్ నేర్చుకున్నా, ఇప్పటికి ఏది తప్పో ఏది ఒప్పో నాకు చెప్పేది తనూజ నే, నాకు ఆమె ఇష్టమన్నారు.
తనూజ మీకు హౌస్ లో ఎవరు పోటీ అనుకుంటున్నారని గౌతమ్ అడిగితే నాకు నేనే పోటీ అంటూ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించింది. ఆతర్వాత నాకు పోటీ కళ్యాణ్ అనుకుంటున్నాను, కళ్యాణ్ మైండ్ గేమ్, కళ్యాణ్ స్ట్రాటజీ లు బావుంటాయి అందుకే తన గేమ్ తను ఆడమని చాలాసార్లు చెప్పాను అంటూ తనకు పోటీ కళ్యాణ్ పడాల అని తేల్చేసింది.
తనూజ అనడం కాదు కానీ బయట ఓటింగ్ లోను తనూజ, కళ్యాణ్ ఓటింగ్ లో పోటీపడుతుండడం చూసి, తనూజ భలే గెస్ చేసింది నిజంగా అంటూ అందరూ ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటున్నారు.