Advertisement
Google Ads BL

తిరుమలలో ఇకపై శివజ్యోతికి నో ఎంట్రీ


యాంకర్ శివ జ్యోతి పై టీటీడీ (తిరుమల తిరుపతి  దేవస్థానం)సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఆమెకు ఇకపై తిరుమలలో నో ఎంట్రీ అంటూ ఆమె ఆధార్ కార్డు ని బ్లాక్ చేసింది. శివ జ్యోతి ఇటీవల శ్రీవారి ప్రసాదం తీసుకుంటూ తిరుమలలో రిచ్చెస్ట్ బిచ్చగాళ్ళం అంటూ సోదరుడితో కలిసి చేసినా ఓ వీడియో ఆమెను సమస్యల్లోకి నెట్టింది, హిందూ సంఘాలు, శ్రీవారి భక్తులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసాయి. 

Advertisement
CJ Advs

దానితో దిగొచ్చిన శివ జ్యోతి నాకు శ్రీవారిపై ఎనలేని భక్తి ఉంది, నా కల నెరవేర్చిన దేవుడు, నా బిడ్డను కూడా ఆ వెంకన్న స్వామే ప్రసాదించాడు, నేను చేసిన ఏడు శనివారాలు వ్రతం చూసి చాలామందికి నాకు వేంకటేశ్వరుడు అంటే ఎంత భక్తో తెలుసు, కానీ నేను తిరుమలలో అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదు, నాపై కేసు పెడతారనో లేదంటే మరేదన్నా విషయమై నేను క్షమాపణలు కోరడం లేదు, నాకే అనిపించింది నేను దేవుడిని అలా అనకూడదు అని అందుకే క్షమించమంటున్నా అంటూ వీడియో వదిలింది. 

శివజ్యోతి వీడియో క్షమాపణలు చెప్పినా టీటీడీ అధికారులు శాంతించలేదు. ఆమె ఇకపై శ్రీవారిని దర్శించుకోకుండా తిరుమలలో నో ఎంట్రీ బోర్డు పెట్టనుంది. అందులో భాగంగా ఆమె ఆధార్ కార్డ్ బ్లాక్ చేసింది. అంటే ఇకపై తిరుమల్లో శివ జ్యోతి కాలు పెట్టేందుకు అనుమతులు టీటీడీ అధికారులు రద్దు చేస్తూ షాక్ ఇచ్చారు. 

 

No entry for Shiva Jyothi in Tirumala:

Aadhar card Blocked to Sivajyothi-TTD serious warning
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs