అవును రామ్ పోతినేని కి నిజంగా ఆంధ్ర కింగ్ తాలూకా ఓవర్సీస్ టాక్, ప్రీమియర్స్ టాక్ చూస్తే బిగ్ రిలీఫ్ వచ్చినట్టే. ఆయన లేటెస్ట్ చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం అన్నివైపుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. ఓవర్సీస్ లో ఆంధ్ర కింగ్ తాలూకా కి హిట్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. సోషల్ మీడియాలో ఓవర్సీస్ ఆడియన్స్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత సక్సెస్ కోసం ట్రై చేస్తున్న హీరో రామ్ కి ఆ విజయం మాత్రం దక్కడం లేదు. ఈ చిత్రం మాత్రం రామ్ కి రిలీఫ్ ఇచ్చినట్టే కనిపిస్తుంది. ఓవర్సీస్ లో సినిమాలు చూసిన వెబ్ సైట్స్ కూడా ఆంధ్ర కింగ్ తాలూకా కి గుడ్ రేటింగ్స్ ఇస్తున్నారు. రామ్ వన్ మ్యాన్ షో, హీరో-హీరోయిన్ ట్రాక్ సూపర్, మహేష్ డైరెక్షన్ ఇంకా డైలాగ్స్ అదుర్స్ అంటున్నారు.
మరి చాలా రోజుల తర్వాత రామ్ ఇలా సోషల్ మీడియాలో తన సినిమాకి వస్తున్న పాజిటివ్ కామెంట్స్ చూసి నిజంగా రిలాక్స్ అవుతుంటాడు, సినిమాకి అన్ని వైపులా నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుంది, పాజిటివ్ రేటింగ్స్, ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కనిపిస్తే సినిమా హిట్టే. అసలే థియేటర్స్ లో ఆయమన్న సినిమా లేక ఆడియన్స్ అల్లాడిపోతున్నారు. ఈ ఆంధ్ర కింగ్ తాలూకా రామ్ కె కాదు ఆడియన్స్ కు రిలీఫ్ ఇచ్చినట్టే.