చాలామంది హీరోయిన్స్ తమ పనికి తగిన పారితోషికాలు ఇవ్వరు, హీరోలతో సమానంగా కష్టపడినా హీరోయిన్స్ కి మాత్రం పదో పరకో ఇచ్చేసి చేతులు దులుపుకుంటారు తప్ప హీరోలతో సమానమైన రెమ్యునరేషన్స్ చెల్లించారు, సినిమా ఇండస్ట్రీలో ఇదో పెద్ద వివక్ష అని చాలామంది హీరోయిన్స్ మాట్లాడుతూ ఉంటారు.
అందులో సమంత లాంటి వాళ్ళు ఓపెన్ గానే ఈ పారితోషికాల వివక్ష పై కామెంట్స్ చేసారు. తాజాగా రివాల్వర్ రీటా ప్రమోషన్స్ లో కీర్తి సురేష్ హీరో-హీరోయిన్స్ నడుమ పారితోషికాల తేడా పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు తక్కువ పారితోషకం ఇవ్వడంలో వివక్ష అంటూ ఏమీ లేదని ఆమె తేల్చేసింది.
డిమాండ్ ని బట్టి పారితోషికాలు ఉంటాయని ఆమె ఒప్పుకుంది. ఏదైనా మార్కెట్‌ను బట్టే నిర్ణయిస్తారు, ఒక ఆర్టిస్టుకు ఉన్న డిమాండ్, అలాగే వారికున్న మార్కెట్‌ను బట్టే పారితోషకం నిర్ణయిస్తారు.. హీరోలతో పోలిస్తే తనకు తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారు అనే బాధ తనకు ఎప్పుడూ లేదని ఆమె స్పష్టం చేసింది.