Advertisement
Google Ads BL

మళ్ళీ ఆసుపత్రిలో చేరిన స్మృతి కాబోయే భర్త


మహిళా క్రికెటర్ స్మృతి మంధన పెళ్లి రోజుకో మలుపు తీసుకుంటుంది. నవంబర్ 23 న జరగాల్సిన స్మృతి మంధన పెళ్లి ఆమె తండ్రి శ్రీనివాస్ అనారోగ్య కారణాల వలన వాయిదా పడింది. తండ్రికి మైల్డ్ హార్ట్ ఎటాక్ రావడంతో స్మృతి మంధన పెళ్లి ని వాయిదా వేసుకుంది. ఆతర్వాత ఆమెకు కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ ఎసిడిటి, ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రి పాలయ్యాడు. 

Advertisement
CJ Advs

పలాశ్ ముచ్చల్ డిస్ ఛార్జ్ అయ్యాక స్మృతి మందాన సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ ఫొటోస్, వీడియోస్ డిలేట్ చెయ్యడం చర్చనీయాంశం అయ్యింది. ఈలోపే పలాశ్ ముచ్చల్ తల్లి మాట్లాడుతూ స్మృతి నాన్నగారికి హెల్త్  బావుండలేదు అందుకె మా అబ్బాయి ఈ పెళ్లిని పోస్ట్ పోన్ చేసాడు అన్నారు. 

అయితే ఈరోజు మంగళవారం పలాశ్ ముచ్చల్ మరోసారి అస్వస్థతకు గురవడంతో ముంబైలోని ఎస్‌వీఆర్ ఆసుపత్రికి తరలించినట్లు అతడి టీమ్ తెలిపింది. పలాస్ ఇలా తరచు అనారోగ్యానికి గురికావడం వెనుక అతను పెళ్లి పనుల్లో అలసిపోయాడని, ఫొటో షూట్‌ల కోసం వరుసగా ప్రయాణాలు చేయడం, అలాగే సంగీత్, ఇతర కార్యక్రమాల్లో డాన్స్ లు చేస్తుండటం, సరైన నిద్ర లేకపోవడం, ఇతర కారణాల వల్ల పలాశ్ ఒత్తిడికి లోనై అస్వస్థతకు గురైనట్లు అతని టీమ్ మీడియాకి తెలిపింది. 

Palash Muchhal Hospitalised:

Smriti Mandhana Fiancé Palash Muchhal Hospitalised
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs