మాస్ మహారాజ్ రవితేజ-శ్రీలీల కాంబోలో డెబ్యూ డైరెక్టర్ భాను భోగవరపు తెరకెక్కించిన మాస్ జాతర పలుమార్లు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ ఫైనల్ గా అక్టోబర్ 31 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాలతో థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపాయింది.
ప్రీమియర్స్ తోనే మాస్ జాతరకు డివైడ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. దానితో అనుకున్న అంచనాలను, ఫిగర్ ను మాస్ జాతర రీచ్ అవ్వలేదు, నిర్మాతలకు నష్టాలు తెచ్చిన మాస్ జాతర ఓటీటీ డేట్ పై ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తి చూపించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ మాస్ జాతర డిజిటల్ రైట్స్ ని ఫ్యాన్సీ డీల్ తో ద్కకించుకుంది.
థియేటర్స్ లో అక్టోబర్ 31 న విడుదలైన మాస్ జాతర ను నెట్ ఫ్లిక్స్ నుంచి ఈనెల 28 నుంచి స్ట్రీమింగ్ లోకి తీసుకురాబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించింది. అది కూడా కొత్త పోస్టర్ తో డేట్ ని అనౌన్స్ చేశారు.