నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ తాండవం ప్రమోషన్స్ లో చాలా అంటే చాలా బిజీగా వున్నారు. అఖండ 2 పాన్ ఇండియా మార్కెట్ లోకి వెళ్లబోతుంది. దానితో బాలయ్య యంగ్ హీరోలా ప్రమోషన్స్ లో కోసం ముంబై నుంచి బెంగుళూరు వరకు చాలా ఎనెర్జీతో పాల్గొంటున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 5 న విడుదల కాబోతుంది.
అఖండ 2 థియేటర్స్ లోకి రాకుండానే బాలయ్య మరో చిత్రాన్ని పట్టాలెక్కించేస్తున్నారు. బాలయ్య బర్త్ డే కె గోపీచంద్ మలినేని మూవీ అనౌన్స్ చేసారు. వీర సింహారెడ్డి తర్వాత మరోమారు జట్టు కడుతున్నారు బాలయ్య- గోపీచంద్ కాంబో పిరియాడికల్ డ్రామాగా NBK 111 ప్రాజెక్ట్ ని గోపీచంద్ మలినేని డిజైన్ చేసారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ అంటూ రీసెంట్ గానే మేకర్స్ అనౌన్స్ చేసారు.
అయితే ఈ చిత్రాన్ని నవంబర్ 26 అంటే రేపు బుధవారం పూజా కార్యక్రమాలతో హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తుంది. నవంబర్ 26 న సుబ్రహ్మణ్యం షష్టి. ఆ రోజు పూజా కార్యక్రమాలతో మొదలైనా.. డిసెంబర్ మూడో వారం నుంచి NBK 111 రెగ్యులర్ షూటింగ్ కి వెళుతుంది అని సమాచారం.