ప్రముఖ క్రికెటర్ స్మృతి మంధాన వివాహం మరికొన్ని గంటల్లో ఎంతో ఘనంగా జరగాల్సి ఉండగా.. ఆమె తండ్రికి అస్వస్థత వలన పెళ్లిని స్మృతి మంధాన పోస్ట్ పోన్ చేసుకున్న విషయం తెలిసిందే. స్మృతి మంధాన వివాహ వేడుకల్లో సరదాగా గడిపిన స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ మంధానకు సడన్ గా హార్ట్ ఎటాక్ రావడంతో ఆయనను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
తండ్రి ఆసుపత్రి పాలవడంతో స్మృతి మంధాన తన పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకుంది. తండ్రి అనారోగ్యంతో అప్ సెట్ అయిన స్మృతి మంధాన కి మరో షాక్ తగిలింది. తండ్రి ఆసుపత్రి పాలైన కాసేపటికి స్మృతి కాబోయే భర్త పలాశ్ ముచ్ఛల్ కూడా అస్వస్థతకు గురయ్యారని తెలుస్తుంది.
ఆయన వైరల్ ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడగా.. వెంటనే పలాశ్ ని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి టెస్ట్ లు చేయించగా... పలాశ్ ముచ్ఛల్ కు పెద్దగా ప్రాబ్లెమ్ లేదు అని చికిత్స తర్వాత వెంటనే పలాశ్ ను డిశ్చార్జ్ చేశామని డాక్టర్స్ తెలిపారు. అటు తండ్రికి అనారోగ్యం, ఇటు కట్టుకోబోయే వాడికి అస్వస్థత తో స్మృతి మంధాన ఆందోళన పడినట్లుగా సన్నిహితులు చెబుతున్నారు.