బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ వీక్స్ లోకి అడుగుపెట్టింది. ఇంకా కేవలం మూడు వారాల ఆట మాత్రమే మిగిలివుంది. మరి ఇప్పటివరకు ఉన్న 9 మంది కంటెస్టెంట్స్ లో ఎవరెవరు టాప్ 5 కి వెళ్ళబోతున్నారు. ఆ విషయంలో జనాల్లో అయితే ఓ క్లారిటీ వుంది. అందులో ఇమ్మాన్యుయేల్, తనూజ, సుమన్ శెట్టి, కళ్యాణ్ టాప్ 4 ఫిక్స్. కానీ ఆ ఐదో కంటెస్టెంట్ రీతూ, లేదంటే డిమోన్ పవన్ అవుతారా అనే కన్ఫ్యూజన్ జనాల్లో నడుస్తుంది.
కానీ హౌస్ మేట్స్ ఫ్యామిలీ మేబెర్స్ టాప్ 5 విషయంలో చాలావరకు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న ఇమ్మాన్యుయేల్, తనూజ, సుమన్ శెట్టి, కళ్యాణ్, రీతూ, డిమోన్ పవన్, సంజన, భరణి, దివ్య లలో ఎవరు టాప్ 5 కి వెళతారో అనే విషయంలో బిగ్ బాస్ స్టేజ్ పై ఫ్యామిలీ మెంబెర్స్ అలాగే వారి సెలెబ్రిటీ ఫ్రెండ్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
ఎక్కువగా తనూజ, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, సుమన్ శెట్టి అక్కడక్కడా రీతూ, డిమోన్ పవన్ లను టాప్ లో పెట్టారు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే భరణి ఫ్యామిలీ భరణిని టాప్ 1 లో పెడితే, ఆయన ఫ్యామిలీ మాత్రం దివ్య ని అస్సలు పట్టించుకోలేదు. తనూజను మనవరాలు అంటూ భరణి తల్లి చెప్పడం అందరికి షాకిచ్చింది.
ఇక దివ్య తాతగారు దివ్య ను టాప్ 5 చివరిలో పెట్టి తనూజ ను టాప్ 2లో పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. ఇక భరణి, దివ్య, సంజన ను మాత్రం టాప్ 5 లో ఉంచేందుకు పెద్దగా ఎవ్వరూ ఇష్టపడలేదు.