క్యూట్ గా నీట్ గా ఆడియన్స్ కు కనెక్ట్ అయిన ముద్దమందారం సీరియల్ నటి తనూజ పుట్టస్వామి ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 లో టాప్ లో దూసుకుపోతుంది. ఆమె డ్రెస్సింగ్ స్టయిల్ కి, ఆమె అందానికి ముగ్దులవుతున్నది కొందరైతే, ఆమె ఆటతీరును చూసి మరికొందరు ఫ్యాన్స్ అయ్యారు. నామినేషన్స్ లోకి రావడం పాపం తనూజ కు ఓట్లు గుద్ధిపారేస్తున్నారు.
అయితే హౌస్ లో తనూజ ఆటతీరు, మాటతీరు బావున్నా ఆమె మాటకు ముందో ఏడుపు, తర్వాతో ఏడుపు ఆమె గ్రాఫ్ పడిపోవడానికి కారణమవుతుంది. ఎమోషనల్ అవడం, భరణి విషయంలో తరచూ దివ్య తో గొడవ, ఇమ్ము ఫ్రెండ్షిప్ దూరంచేసుకోవడం ఆమెకు మైనస్ అయ్యింది. అయితే ఫ్యామిలీ వీక్ తర్వాత ఆదివారం ఫ్రెండ్స్, ఫ్యామిలీ వచ్చినప్పుడు కమెడియన్ అవినాష్ తనూజ ను మహానటి అంటూ కామెడీగా మాట్లాడాడు.
నిజమే తనూజ మహానటే. అసలు ఆమె ఫ్యామిలీ ఎవరూ స్టేజ్ పైకి రాలేదు, ఆమె నటించిన సీరియల్ కో యాక్టర్స్ పవన్ ఇంకా హరిత తనూజ కోసం వస్తే.. తనూజ ఏడ్చింది చూడండి. అసలు ఫ్యామిలీ కన్నా ఎక్కువగా ఎమోషనల్ అయ్యింది. మరి ఇమ్మాన్యుయేల్, దివ్య అనడం కాదు కానీ తనూజ సీరియల్ యాక్టింగ్ చేస్తుంది అంటూ జనాలు కూడా కామెంట్లు పెడుతున్నారు.