చాలామంది బుల్లితెర నటులు యూట్యూబ్ వీడియోస్ కోసం చాలా దిగజారిపోతున్నారు. బాత్ రూమ్ వీడియోస్, కిచెన్ లో వీడియోస్, ఫ్రిజ్ టూర్, హోమ్ టూర్, వెజిటేబుల్ మర్కెట్ టూర్, ట్రావెల్ టూర్ అమ్మో వాళ్ళ వీడియోస్ చేసే విధానానికి చాలామందికి చిరాకు వస్తే, ఎంతోమంది వాళ్ళ వీడియోస్ ని చూస్తూ వాళ్లని సపోర్ట్ చేస్తున్నారు.
కాలు కదిపినా వీడియో, పూజ చేసినా వీడియో, హోటల్ కి వెళ్లినా వీడియో, గుడికి వెళ్లినా వీడియో, ఏ అవకాశాన్ని, ఏ సందర్భాన్ని వదులుకోవడం లేదు. ఇలానే గతంలో తిరుమల వెంకటేశ్వర స్వామి గుడిలో రీల్స్ చేసిన ప్రియాంక జైన్, ఆమె బాయ్ ఫ్రెండ్ శివ లపై అప్పట్లో నెటిజెన్స్, భక్తులు ఫైర్ అయ్యారు. అదే శ్రీవారి సన్నిధిలో వేంకటేశ్వరుడి ప్రసాదాన్ని కించపరిచే విధంగా కామెంట్స్ చేసిన శివ జ్యోతిపై హిందూ సంఘాలు, శ్రీవారి భక్తులు ఫైర్ అవుతున్నారు. ట్రోల్ చేస్తున్నారు.
ఆమె ఏడు శనివారాలు వ్రతం చేసుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి లైన్ లో నిలబడి శ్రీవారి అన్న ప్రసాదం తీసుకుంటున్న సమయంలో తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం.. రిచెస్ట్ బిచ్చగాళ్లం మేమే అంటూ వీడియో చేసి దానిని షేర్ చేసింది. దానితో శ్రీవారి భక్తులు, హిందూ సంఘాల మనోభావాలను దెబ్బ తీశాయి. దీంతో తీవ్రంగా ఆగ్రహాం వ్యక్తం చేశారు. శ్రీవారి భక్తులు ఆమెపై మండిపడుతూ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
దెబ్బకి దిగొచ్చిన శివ జ్యోతి శ్రీవారి భక్తులకు, శ్రీవారిని క్షమాపణ కోరుతూ వీడియో చేసింది. తను కొద్దిరోజులుగా శనివారాలు వ్రతం చేస్తూ పూజ విధానం గురించి చెబుతుంటే నాకు దేవుడిపై ఎంత భక్తి ఉందొ నా ఫాలోవర్స్ కి తెలుసు. అంతే కాకుండా తన జీవితంలో అత్యంత విలువైన బిడ్డను కూడా స్వామి ప్రసాదమేనని చెబుతూ ఎమోషనల్ అయ్యింది శివ జ్యోతి.. .
నాకు అన్ని విధాలుగా తోడుగా ఉన్న స్వామి గురించి నేను తప్పుగా ఎలా మాట్లాడతాను, అలా మాట్లాడను. నా మాటలుతో ఎవరైనా హార్ట్ అయి ఉంటే.. నిజంగా క్షమించండి, ఎవరో కేసులు పెడతారని భయపడి నేను క్షమాపణలు చెప్పడం లేదు. నాకు కూడా ఆ మాటలు తప్పుగా అన్నాననే ఫీలింగ్ వచ్చింది. అందుకే ఈ క్షమాపణ అంటూ శివ జ్యోతి ఆ వీడియో లో చెప్పుకొచ్చింది.