సౌత్ నుంచి జెండా పీకేసాక హిందీలో అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ముంబై లోనే ఉండిపోయిన రకుల్ ప్రీత్ సింగ్ కి అక్కడ సినిమాలు చేస్తుంది కానీ విజయం దరి చేరడం లేదు. వరస సినిమాలు, సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తూ ఎప్పుడు వార్తల్లోనే ఉంటుంది.
గ్లామర్ అంటే రకుల్ ప్రీత్, రకుల్ ప్రీత్ అంటే గ్లామర్ అన్న చందాన ఆమె డ్రెస్సింగ్ స్టయిల్ ఉంటుంది. హిందీలోకి ఎంట్రీ ఇచ్చిన ఇన్నేళ్లకు రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో దే దే ప్యార్ దే 2 చిత్రంతో సక్సెస్ కొట్టినట్టే కనిపిస్తుంది. ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి 50 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టిన ఆ చిత్రం మొత్తం కలెక్షన్స్ పరంగా ఎంతవరకు వెళ్లి ఆగుతుంది అనేది చూడాలి.
తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ చూసి అమ్మడు గ్లామర్ గా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బుల్లి నిక్కర్ లో రకుల్ ప్రీత్ అందాల రచ్చ మాత్రం మాములుగా లేదు. మీరు కూడా రకుల్ ప్రీత్ లేటెస్ట్ ఫొటోస్ ఓ లుక్కెయ్యండి.