మహానటి కీర్తి సురేష్ వచ్చే వారం రివాల్వర్ రీటా గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. తెలుగులో విజయ్ దేవరకొండ తో రౌడీ జనార్దన్ సినిమాకి సైన్ చేసిన కీర్తి సురేష్ వేణు బలగం ఎల్లమ్మ లో కీలక పాత్ర లో కనిపించబోతుంది అనే టాక్ ఉంది. ప్రస్తుతం రివాల్వర్ రీటా ప్రమోషన్స్ లో కీర్తి సురేష్ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటుంది.
ఒకప్పుడు బొద్దుగా ఉన్న కీర్తి సురేష్ యోగ తో చాలా సన్నగా నాజుగ్గా తయారైంది. అయితే కీర్తి సురేష్ తాజాగా తన ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో ఆమె ఫ్యాన్స్ షాకవుతున్నారు. కారణం హీరోయిన్స్ మాదిరి కీర్తి సురేష్ ఖఠినమైన ఫుడ్ హ్యాబిట్స్ ని పాటించదట. నేను ఫిట్నెస్ విషయంలో ఎలాంటి టెన్షన్ పెట్టుకోను, మరీ సీరియస్ డైట్ చెయ్యను.
నాకు నచ్చింది తింటాను. నా బ్రేక్ ఫాస్ట్ లో రోజుకు 10 ఇడ్లీలు గానీ, 10 దోసెలు కానీ ఉంటాయి. అన్ని నేను తింటాను అని చెప్పిన కీర్తి సురేష్ ని అంత తింటే ఇంత స్లిమ్ గా ఎలా ఉన్నారని అడిగితే.. నేను డైట్ మాత్రమే ఫాలో అవ్వను. కానీ వర్కౌట్స్ మాత్రం రెగ్యులర్‌గా చేస్తా. అలా చేసే ఒకే ఏడాదిలో నేను 10 కిలోలు తగ్గాను అంటూ కీర్తి సురేష్ బ్రేక్ ఫాస్ట్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.