బిగ్ బాస్ సీజన్ 9 కె హైలెట్ ఎపిసోడ్ అంటే ఈ శుక్రవారం ఎపిసోడ్ అనే చెబుతున్నారు బిగ్ బాస్ ఆడియన్స్. సీజన్ 9 చాలా చప్పగా సాగింది, సెలబ్రిటీస్ vs కామనర్స్ అంటూ బిల్డప్ ఇచ్చారు కానీ మేటర్ లేదు అని మాట్లాడుకుంటున్న వాళ్లకు గత రాత్రి ఎపిసోడ్ కిక్ ఇచ్చింది. తనూజ vs దివ్య గొడవ ఒక రేంజ్ లో జరిగింది.
నువ్వెంత అంటే నువ్వెంత అనే రేంజ్ లో అన్నమాట. మరి శనివారం ఎపిసోడ్ లో నాగార్జున ఈ గొడవ గురించి ఖచ్చితంగా మాట్లాడతారు, కాదు మాట్లాడారు. తనూజ నీకు కెప్టెన్సీ వచ్చాక కళ్ళు నెత్తికెక్కాయా అంటూ స్టార్ట్ చేసిన నాగ్ ఈ గొడవలో తప్పెవరిది దివ్య దా, తనూజ దా అని భరణిని అడిగితే ఆయన దివ్య తప్పు లేదు తనూజ దే తప్పే అన్నారు.
ఇమ్మాన్యుయెల్ మాత్రం తనూజ స్టాండ్ తీసుకుంది అందులో తప్పు లేదు అన్నాడు, డిమోన్ పవన్ మాత్రం దివ్య కరెక్ట్, తనూజ మాటలు వదిలేసింది అన్నాడు. మీ గొడవలోకి భరణి ని ఎందుకు లాగారు అని నాగార్జున ఫైర్ అయ్యారు. ఏదైనా ఈ రోజు ఎపిసోడ్ లో నాగార్జున దివ్య, తనూజ పై ఆగ్రహం వ్యక్తం చెయ్యడమే కాదు తనూజ కి మాత్రం మాటలతో పాతాళానికి పడిపోతావ్ అంటూ గట్టి హెచ్చరికే ఇచ్చారు. మరి ఫుల్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది అనేది కొన్ని గంటలు వెయిట్ చేస్తే సరి.