సమంత రౌత్ ప్రభు ఎపుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే పేరు. ఇప్పుడు కూడా సమంత పేరు ట్రెండింగ్ లోనే ఉంది. కారణం సమంత జిమ్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. షాకింగ్ లుక్ కాదు షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ లోకి మారిపోయిన సమంత ఆ పిక్స్ లో తన జిమ్ ట్రైనర్ తో కలిసి కనిపించింది.
ఆ ఫొటోస్ తో పాటుగా ఫుల్ యాక్షన్ మోడ్.. బీస్ట్ మోడ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దానితో పాటు కొన్నేళ్ల క్రితం నా బ్యాక్ బలంగా లేదని వదిలేశా.. ఎందుకంటే నా జీన్స్ లో అలా లేదని అనుకునేదాన్ని, ఎవరినైనా అలాంటి బ్యాక్ కలిగిన వారిని చూసినప్పుడు.. నాకు అలా సాధ్యం కాదని అనుకుంటానని చెప్పిన సమంత ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నా.. దాన్ని ఇప్పుడు చూపించబోతున్నా..
ఎందుకంటే ఇక్కడికి చేరుకోవడానికి చాలా తీవ్రంగా శ్రమించానని చెప్పుకొచ్చింది. ఎప్పుడు ఫిట్ నెస్ ఫ్రీక్ గా ఉండే సమంత అనారోగ్యం తరవాత ఎక్కువగా జిమ్ లోనే గడిపేస్తుంది. నటనకు బ్రేక్ ఇచ్చినా ముంబై లోనే ఉంటూ అక్కడే జిమ్ కి వెళుతూ ఈమధ్యనే ఓ కొత్త ఇల్లు కూడా కొనేసిన సమంత దర్శకుడు రాజ్ నిడిమోరు తో కలిసి షికార్లు చేస్తుంది.
త్వరలోనే ఈ జంట శుభ వార్త వినిపించబోతుంది అనే టాక్ ఉంది. అంతేకాదు రీసెంట్ గానే నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం సినిమాని స్టార్ట్ చేసిన సమంత ఇందులోనూ రాజ్ నిడిమోరు ని ఇన్వాల్వ్ చెయ్యడమే అందరి అనుమానాలకు బలం చేకూరేలా చేసింది.