వేలు లక్షల కోట్ల సామ్రాజ్యాలను నడిపిస్తున్నారు రిలయన్స్ అంబానీలు. పెద్ద వాడైన ముఖేష్ అంబానీ తనకు వాటాగా వచ్చిన ధీరూభాయ్ అంబానీ ఆస్తులను వందల రెట్లు పెంచి పోషించగా, చిన్నవాడైన అనీల్ అంబానీ తన వాటా ఆస్తులు కంపెనీలను దివాళా తీయించారు. ముప్పిరిగొలపనివ్వని వివాదాలు, ఆర్థిక కుంభకోణాలు, బ్యాంకింగ్ సెక్టార్ లో మోసాలు వగైరా కేసులలో అనీల్ అంబానీపై సీరియస్ గా దర్యాప్తు సాగుతోంది.
ఇటీవల హవాలా కేసులోను అనీల్ అంబానీపై విచారణ సాగుతోంది. షెల్ కంపెనీల ద్వారా 40 కోట్ల సొమ్ములను విదేశాలకు బదలాయించారు. ఇది కనీసం 600 కోట్ల రూపాయల హవాలాకు సంబంధించిన లింకులను కలిగి ఉందని ఈడీ విశ్లేషిస్తోంది. ఇలాంటి సమయంలో 2019లో మరణించిన లైంగిక అక్రమ రవాణా నేరస్తుడు జెఫ్రీకి సంబంధించిన ఫైల్స్ ని పరిశీలించేందుకు అమెరికా సెనేట్ ఆమోదించింది. ట్రంప్ బిల్లుపై సంతకం చేసాడు.
అయితే ఎఫ్‌స్టీన్ జెఫ్రీతో అనీల్ అంబానీ సంబంధాలపై చాలా పెద్ద దుమారమే చెలరేగింది. ఇప్పుడు రాజకీయ కార్యకర్త, న్యాయవాది భూషణ్ అనీల్ అంబానీకి అంతర్జాతీయ నేరస్తుడిపై సంబంధాల గురించి గుచ్చి గుచ్చి ప్రస్థావించారు. జెఫ్రీ కస్టడీలో ముగిసిన ఇన్నేళ్ల తర్వాత తిరిగి ఈ కేసుకు సంబంధించిన ఫైల్ వేగంగా ముందుకు సాగుతోంది. జెఫ్రీతో అనీల్ అంబానీ ఈమెయిల్ సంభాషణలు కొనసాగించారని, పరస్పరం మెయిల్స్ పంపుకున్నారని భూషణ్ ఆరోపించారు. జెఫ్రీ నేరాలు, ప్రముఖులతో కనెక్షన్లపై 50వేల పేజీల డాక్యుమెంట్ రెడీ అయింది. దీనిలో అంబానీ దొరికిపోతాడని చెబుతున్నారు. అయితే జెఫ్రీతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నారు.