అఖండ తాండవం నుంచి పవర్ ఫుల్ ట్రయిలర్ వచ్చేసింది. బోయపాటి దర్శకత్వంలో నందమూరి నటసింహ తాండవం ఆడేసారు. అఘోర గా బాలయ్య ఫస్ట్ లుక్ మాదిరి ఈ ట్రైలర్ లో అద్దరగొట్టేసారు. విలన్స్ ని మట్టి కాదు మంచు కురిపించే సన్నివేశాలకు గూస్ బంప్స్ రావాల్సిందే. అఖండ కు సీక్వెల్ గా వస్తుంది గనక అఖండ 2లో అందులోని ఆర్టిస్ట్ లు ఈ చిత్రంలోనూ కంటిన్యూ అయ్యారు.
బాలయ్య మాత్రం త్రిశూలం తో మంచు పర్వతాలలో విలన్ ఆది పినిశెట్టి గ్యాంగ్ ని విలయతాండవం చేసిన నృత్యం మాత్రం ఈ ట్రైలర్ కే హైలెట్. ఆది పిశెట్టి మాంత్రికుడిగా పవర్ ఫుల్ పాత్రలో బాలయ్య కు తగిన విలన్ అనిపించారు. ఎమోషన్స్, అటు యాక్షన్ సీక్వెన్స్, బాలయ్య డైలాగ్స్, బాలయ్య లుక్స్, ఆ కేరెక్టర్ విశ్వరూపం అన్ని అఖండ 2 ట్రైలర్ కి హైలెట్.
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ BGM అయితే అభిమానులను శివతాండవం ఆడించింది. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, బోయపాటి మేకింగ్ అన్ని అఖండ తాండవం పై విపరీతమైన అంచనాలు పెంచుతున్నాయి. డిసెంబర్ 5 న థియేటర్స్ లో బాలయ్య శివతాండవం చూసేందుకు అభిమానులే కాదు మాస్ ఆడియన్స్ సైతం ఎదురు చూసేలా అఖండ 2 ట్రైలర్ ఉంది అనడంలో సందేహమే లేదు.