ఈరోజు శుక్రవారం నందమూరి బాలకృష్ణ - బోయపాటి కలయికలో తెరకెక్కిన అఖండ తాండవం ట్రైలర్ లాంచ్ ను చిక్‌బల్లాపూర్‌లోని ఓపెన్ గ్రౌండ్ లో ఏర్పాటు చెయ్యగా దాని కోసం నందమూరి అభిమానులు కోకొల్లలుగా అక్కడికి చేరుకున్నారు. అఖండ 2 ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు చిక్‌బల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో లాంచ్ చేయాల్సి ఉంది.
అఖండ 2 ఈవెంట్‌కు శివరాజ్‌కుమార్ ముఖ్యఅతిథిగా రాబోతున్నారు. శివరాజ్ కుమార్ చేతుల మీదుగా అఖండ తాండవం పవర్ ఫుల్ ట్రైలర్ ను లాంచ్ చేయాలనుకున్నారు. అయితే ఈవెంట్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా.. అక్కడ బెంగుళూరుకు సమీపంలో భారీ వర్షం ఈవెంట్ కు అడ్టంకిగా మారింది. అయితే వర్షం తగ్గాక ఈవెంట్ కాస్త లేట్ గా స్టార్ట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది.
ఆ వర్షం తాకిడితో రాత్రి గం. 7:56 ని లకు డిజిటల్ గా అఖంఢ 2 ట్రైలర్ విడుదల కానుంది. దానితో నందమూరి అభిమానులు కొద్దిగా డిజప్పాయింట్ అవుతున్నారు.