పాత సంవత్సరానికి బాయ్ చెప్పి కొత్త సంవత్సరానికి వెల్ కం చెప్పడానికి యూత్ ఇప్పటి నుంచే కలలు కంటున్నారు. డిసెంబర్ మొదటి వారం నుంచి 31 మిడ్ నైట్ గురించిన ఫీవర్ మరింత రాజుకుంటుంది. ఇప్పటికే లేట్ నైట్ పార్టీల కోసం బుకింగులు జరుగుతున్నాయి. నైట్ పార్టీలో డ్యాన్స్ ఈవెంట్ల కోసం ఐటమ్ భామలు ఇప్పటికే బుక్కవుతున్నారు. క్లబ్బు పబ్బు కాదేదీ కిక్కుకనర్హం.
అయితే ఈ కిక్కును ఈసారి ప్రియుడు కబీర్ బాహియాతో ఆస్వాధించేందుకు కృతి సనోన్ ఇప్పటి నుంచే ప్లాన్స్ లో ఉందని గుసగుస వినిపిస్తోంది. కబీర్‌తో కృతి దుబాయ్ లేదా ఏదైనా విదేశీ డెస్టినేషన్ కి జంప్ అయిపోవడానికి సిద్ధమవుతోందని చెబుతున్నారు. ఈరోజు కబీర్ పుట్టినరోజు సందర్భంగా కృతి అతడికి బర్త్ డే విషెస్ చెప్పింది.
ఈ విషెస్‌లో అతడిపై తన మనసును ఆవిష్కరించింది. కబీర్ లాంటి వ్యక్తితో సమయం గడపడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇండికేషన్ ఇచ్చింది. దీనిని బట్టి డిసెంబర్ 31 రాత్రి ఈ ప్రేమ గువ్వలు ఏ విదేశీ గూటికి చేరిపోతాయో అంటూ అభిమానులు ఊహాగానాలు సాగిస్తున్నారు. కృతి నటించిన తేరే ఇష్క్ మే ఈ నెలలో విడుదల కానుంది. సహనటుడు ధనుష్ తో కలిసి ప్రచారంలో తలమునకలుగా ఉంది. రాంజానా ఫేం ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది.
కబీర్ బాహియా యూకేకి ప్రముఖ బిజినెస్ మ్యాగ్నెట్ కుల్విందర్ బాహియా కుమారుడు. కుల్విందర్ ట్రావెల్ ఏజెన్సీని రన్ చేస్తున్నారు. కబీర్ విదేశాలలో వ్యాపార నిర్వహణలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. పలుమార్లు కృతితో కలిసి విదేశీ ఔటింగుల్లో కనిపించాడు. కృతి ఇంట్లో జరిగిన దీపావళి పార్టీలోను అతడు సైలెంట్ గా ప్రవేశించాడని గుసగసలు వినిపించాయి. ఈ జంట 2016లో పెళ్లికి సిద్ధమవుతోందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.