నేచురల్ బ్యూటీ సాయి పల్లవి పేరు ఈ మద్యన పెద్దగా వినిపించడం లేదు. హిందీ లో రామాయణ చిత్రంలో సీత గా నటిస్తున్న సాయి పల్లవి ఎక్కువగా ఉన్న పాత్రలను ఒప్పుకుంటుంది. ఇక ప్రవైట్ లైఫ్ లో మాత్రం చాలా లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తుంది. స్నేహితులతో, లేదంటే చెల్లెలు పూజ కన్నన్ తో కలిసి ఎక్కువగా వెకేషన్స్ కి వెళ్లే సాయి పల్లవి ఆ విషయాన్ని కూడా షేర్ చెయ్యదు, ఆమె చెల్లెల్లు పూజ ఇలాంటి విషయాలను, ఆ వెకేషన్స్ పిక్స్ ని షేర్ చేస్తుంది.
తాజాగా సాయి పల్లవి తన సిస్టర్ పూజ తో కలిసి వెకేషన్ కు వెళ్లడమే కాదు, సాయి పల్లవి బీచ్ లో చిన్న పిల్లలా ఎంజాయ్ చేస్తూ గెంతులు వేస్తున్న పిక్స్ ను సోషల్ మీడియా నుంచి ఇన్స్టా హ్యాండిల్ లో షేర్ చెయ్యగానే నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఎంత క్యూట్ గా ఉందొ, ఎంత సింపుల్ గా ఉందొ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజెన్లు.
బీచ్ లో కూర్చుకుని తుళ్ళుతూ చెల్లెలు పూజ తో కలిసి ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి పేరు తాజాగా ధనుష్ D55 లో వినిపిస్తుంది. గతంలో రౌడీ బేబీ అంటూ ధనుష్-సాయి పల్లవి ఎంతగా సెన్సేషన్ క్రియేట్ చేసారో అందరికి తెలుసు. అందుకే మరోసారి ఈ జోడి కలిసి కనిపిస్తుంది అనగానే అందరిలో ఆసక్తి కనిపిస్తుంది.