యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబో లో తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా ఫిలిం డ్రాగన్(వర్కింగ్ టైటిల్) వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కి రిలీజ్ అంటూ మేకర్స్ ఎప్పుడో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు. మరి ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయా అంటే ఏది స్పష్టత లేదు. కారణం రిపబ్లిక్ డే కి ముందు సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాల ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో చూస్తున్నాము.
ప్రభాస్ రాజా సాబ్ కానివ్వండి, మెగాస్టార్ మన శంకర వర ప్రసాద్ గారు కానివ్వండి, కుర్ర హీరోలైన నవీన్ పోలిశెట్టి అనగనగ ఒక రాజు కానివ్వండి, శర్వానంద్ నారి నారి నడుమురారి కానివ్వండి, ఆఖరికి డబ్బింగ్ సినిమాలైన విజయ్ జన నాయగన్, శివకార్తికేయన్ పరాశక్తి ఇలా ప్రతి ఒక్క సంక్రాంతి మూవీ కాస్తో కూస్తో ప్రమోషన్స్ మొదలు పెట్టేశాయి.
సంక్రాంతి వెళ్ళాక రెండు వారాలకు విడుదలకాబోయే ఎన్టీఆర్-నీల్ చిత్రానికి సంబందించిన ఏ ఒక్క అప్ డేట్ లేదు. కనీసం ఫస్ట్ లుక్ కూడా నీల్ ఇవ్వకుండా నాన్చుతున్నారు. ఈ లెక్కన ఎన్టీఆర్-నీల్ డ్రాగన్ జనవరి 26 రిపబ్లిక్ డే అంటే అనుకున్న సమయానికి విడుదల సాధ్యమేనా అనే అనుమానాలు స్టార్ట్ అయ్యాయి.
దసరా, దీపావళి ఇలా పండగలన్ని వెళ్ళిపోయినా ఇప్పటివరకు ఎన్టీఆర్-నీల్ అప్ డేట్ ఇవ్వలేదు. షూటింగ్ ఎంతవరకు వచ్చిందో చెప్పరు, నిర్మాత మాత్రం వచ్చే ఏడాది అనుకున్న సమయానికే మన సినిమా అంటారు తప్ప అప్ డేట్ పై క్లారిటీ ఇవ్వరు. చూద్దాం డ్రాగన్ రిపబ్లిక్ డే కి ఉంటుందా, పోస్ట్ పోన్ అవుతుందా అనేది.