రష్మిక మందన్న లేటెస్ట్ చిత్రం ద గర్ల్ ఫ్రెండ్ రెండు వారాల క్రితమే విడుదలై మంచి రెస్పాన్స్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. యూత్ కి కనెక్ట్ అవడంతో గర్ల్ ఫ్రెండ్ 30 కోట్లకు పైగా కలెక్షన్స్ తీసుకొచ్చింది. ఓ హీరోయిన్ సెంట్రిక్ మూవీ ఇలా ఈ రేంజ్ లో కలెక్షన్స్ తీసుకురావడం నిజంగా రష్మిక కి ఉన్న క్రేజ్ కి నిదర్శనం.
థియేటర్స్ లో హిట్ అయిన ద గర్ల్ ఫ్రెండ్ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఓటీటీ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. గర్ల్ ఫ్రెండ్ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో అంటే 14 దాదాపుగా కోట్లు చెల్లించి మరీ డీల్ క్లోజ్ చేసినట్లుగా తెలుస్తుంది.
తాజాగా ది గర్ల్‌ఫ్రెండ్ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. అది డిసెంబర్ 11 నెట్ ఫ్లిక్స్ వేదికగా OTT లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి నెట్ ఫ్లిక్స్ ఇంకా అఫీషియల్ గా ఈ డేట్ అయితే ఎనౌన్స్ చెయ్యలేదు.