రామ్ చరణ్ పెద్ది చికిరి చికిరి పాట ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో దానికొస్తున్న వ్యూస్ చూస్తే అర్ధమవుతుంది. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్, రామ్ చరణ్ డాన్స్, జాన్వీ కపూర్ అందాలు అన్ని చికిరి చికిరి సాంగ్ ని పెద్ద హిట్ చేసాయి. రామ్ చరణ్ స్టెప్స్ తెగ పాపులార్ అయ్యాయి.
అవి ఎంతగా అంటే.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, ఎవ్వరు చూసినా ఈ చికిరి సాంగ్ స్టెప్స్ వేసేంతగా పాపులర్ అయ్యింది. అయితే యూత్ కన్నా ఎక్కువగా ఈ చికిరి సాంగ్ చిన్న పిల్లలకు, కాస్త ఏజెడ్ పీపుల్ కు బాగా ఎక్కేసింది. వయసు తో సంబంధం లేకుండా మహిళలు, అబ్బాయిలు కూడా ఈ పాటకు స్టెప్స్ వేసి అద్దరగొట్టేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాట మోతే వినిపిస్తుంది. చరణ్ మాదిరి నోట్లో బీడీ పెట్టి మరీ క్రికెట్ షాట్స్ వేస్తూ డాన్స్ లు చేస్తున్నారు. నిజంగా పెద్ది చికిరి సాంగ్ మాత్రం క్రేజీ అనే చెప్పాలి. సినిమా విడుదలయ్యేవరకు ఈ సాంగ్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.