క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పిరిట్ సెట్ లో జాయిన్ అవుతారా అనే విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత క్యూరియాసిటీగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ స్పిరిట్ మూవీ అనౌన్సమెంట్ వచ్చి మూడేళ్లవుతుంది. రీసెంట్ గా సందీప్ వంగ ఓ ఈవెంట్ లో ఈ నెల చివరి నుంచి స్పిరిట్ మొదలవుతుంది అన్నారు.
అందుకు అనుగుణంగానే సందీప్ వంగా తన పని స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. మరి సినిమా స్క్రిప్ట్ అలాగే ప్రీ ప్రొడక్షన్ అంతా ఫినిష్ చేసుకున్న సందీప్ వంగ సెట్ లోకి అడుగుపెట్టాలంటే ప్రభాస్ లుక్ ఫైనల్ చెయ్యాలి. అందుకు ఫోటో షూట్ చేసి లుక్ ని టెస్ట్ చెయ్యాలి. అదే ఇప్పుడు జరిగినట్లుగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
తాజాగా సమాచారం మేరకు స్పిరిట్ కి సంబంధించిన ప్రభాస్ లుక్ టెస్ట్ నిన్న ప్రభాస్ నివాసంలోనే సందీప్ వంగ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా సందీప్ వంగా టీమ్ ఇప్పటికే మూడు పవర్ ఫుల్ లుక్స్ లాక్ చేసినట్లుగా చెబుతున్నారు. మరి పోలీస్ అధికారిగా ప్రభాస్ స్పిరిట్ లో కనిపిస్తారని సందీప్ వంగా ఎప్పుడో షేర్ చేసారు.
మరి ఇప్పుడా పోలీస్ లుక్ లో ప్రభాస్ ఎలా ఉంటారో, సందీప్ వంగా ఎలాంటి పోలీస్ లుక్ ఫైనల్ చేసారో అనేది కాస్త వేచి చూస్తే తెలుస్తుంది.