కొంతమంది హీరోయిన్స్ కి అందం ఉంటుంది, గ్లామర్ ఉంటుంది, నటన విషయంలోనూ ఎంతోకొంత నేర్పరితనం ఉంటుంది. కానీ అన్ని ఉన్నా కొందరికి అదృష్టం అనేది ఆవగింజంతే ఉంటుంది. అలాంటి హీరోయిన్ ఒకరున్నారు. ఆమె భాగ్యశ్రీ బోర్సే. మిస్టర్ బచ్చన్ చిత్రంతో బ్యూటిఫుల్ హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమైన భాగ్యశ్రీ బోర్సే కి ఆ చిత్రం డిజాస్టర్ ని ఇచ్చి డిజప్పాయింట్ చేసింది.
ఆతర్వాత విజయ్ దేవరకొండ అయినా ఆమెకు కలిసొచ్చి కింగ్ డమ్ తో హిట్ ఇస్తారని అనుకుంటే కింగ్ డమ్ లో ఆమె పాత్ర కనెక్ట్ అయినా.. సినిమా రిజల్ట్ భాగ్యశ్రీ కి షాక్ ఇచ్చింది. ఆతర్వాత ఆమె ఆశలన్నీ కాంత పైనే పెట్టుకుంది. దుల్కర్ సల్మాన్-రానా, సముద్రఖని లాంటి లెజెండ్స్ తో వర్క్ చేసిన భాగ్యశ్రీ బోర్సే కి ఆ చిత్రం ఉపశమనం ఇస్తుంది అని బలంగా నమ్మింది.
రీసెంట్ గా విడుదలైన కాంత చిత్రానికి తమిళనాట హిట్ టాక్ స్ప్రెడ్ అయినా.. తెలుగులో మాత్రం మిక్స్డ్ రివ్యూస్ రావడం, ఆడియన్స్ కూడా మిక్స్డ్ రెస్పాన్స్ చూపించడంతో కాంత రిజల్ట్ ఏమిటో అనేది క్లారిటీ వచ్చేసింది.
ఏదైనా ఈ చిత్రం కూడా భాగ్యశ్రీ బోర్సే కి పూర్తి సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేదు అనే చెప్పాలి. మరి ఇదే నెల చివరిలో రాబోతున్న రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా అయినా ఆమెకు సక్సెస్ అందించాలని కోరుకుందాం.