బిగ్ బాస్ సీజన్ 9 లో ఇప్పటివరకు నామినేషన్స్ లోకి అంటే పది వారాల తర్వాత నామినేషన్స్ లోకి వచ్చాడు కమెడియన్ ఇమ్మాన్యుయేల్. మొదటినుంచి హౌస్ లో అందరితో క్లోజ్ గా ఉంటూ కామెడీ చేస్తూ నాగార్జున తో వీకెండ్ పొగిడించుకుంటూ ఆడియన్స్ రోలో టాప్ 2 లో ఉన్న ఇమ్మాన్యుయేల్ మొత్తానికి పది వారాల తర్వాత నామినేషన్స్ లోకి వచ్చాడు.
మరి ఇమ్మాన్యుయేల్ నామినేషన్స్ లోకి వస్తే అతని ఆయన అభిమానులు ఓట్లు గుద్దిపడేస్తారు. ఎందుకంటే ఇమ్మాన్యుయేల్ కామెడీ ని ఆడియన్స్ ఇష్టపడతారు. కానీ తనూజ విషయంలో, గౌరవ్ విషయంలో ఇమ్మాన్యువల్ తీసుకున్న డెసిషన్స్ విషయంలో భరణి ని తరచూ టార్గెట్ చెయ్యడం లో కాస్త ఇమ్మాన్యుయేల్ పై నెగిటివిటి ఏర్పడింది.
అందుకేనేమో నామినేషన్స్ లోకి రాగానే టాప్ లో ఉంటాడు అనుకున్న ఇమ్ము కొద్దిగా వెనుకబడ్డాడు. సోల్జర్ కళ్యాణ్ ఇమ్మాన్యుయేల్ ని తొక్కేస్తున్నాడు. నిన్నటివరకు నామినేషన్స్ లో తనూజ కి గట్టి పోటీ ఇచ్చిన కళ్యాణ్ పడాల ఇప్పుడు ఇమ్మాన్యుయేల్ కి గట్టి పోటీ ఇస్తున్నాడు. ఈ వారం ఓటింగ్ లో కళ్యాణ్ టాప్ 1 లో ఉంటే.. ఇమ్మాన్యువల్ పది శాతం ఓట్ల తేడాతో సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. థర్డ్ పొజిషన్ లో భరణి ఉన్నాడు.
ఇక ఈ వారం డేంజర్ పొజిషన్ లో డిమోన్ పవన్, సంజన, దివ్య ఉన్నారు. మరి ఈ ముగ్గురిలో దివ్య లేదా సంజన ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది.