బిగ్ బాస్ సీజన్ 9 లో పదో వారం జరగాల్సిన ఫ్యామిలీ వీక్ ఈ వారం మొదలయ్యింది. అంటే 11 వ వారంలో ఫ్యామిలీ వీక్ జరుగుతుంది. గత రాత్రి నామినేషన్స్ ప్రక్రియ ఘరమ్ ఘరమ్ గా జరిగింది. మొదటిసారి అంటే సీజన్ 9 మొదలయ్యాక ఇమ్మానుయేల్ నామినేషన్స్ లోకి వచ్చాడు. ఇమ్మాన్యుయేల్ ని భరణి నామినేట్ చేసారు. ఇక హౌస్ లో సగం అంటే ఇమ్మాన్యుయేల్, భరణి, సంజన, పవన్ లు రీతూ ని నామినేట్ చేయగా కెప్టెన్సీ పవర్ తో రీతూ ని తనూజ సేవ్ చేసింది.
ఈ వారం కెప్టెన్ గా తనూజ, సుమన్ శెట్టి తప్ప మిగతా హౌస్ నామినేషన్స్ లోకి వచ్చింది. అంతేకాకుండా ఈవారం ఫ్యామిలీ ఎమోషన్స్ మొదలయ్యాయి. ముందుగా తనూజ సిస్టర్ పూజ తమ అక్క కొడుకుతో అడుగుపెట్టింది. తనూజ చెల్లి పూజ కి పెళ్లి కుదరగా హౌస్ లో పెళ్లి కార్డ్ అక్క తనూజా కి అందించి ఆమె ఆశీర్వాదం తీసుకుంది.
ఇక ఈ రోజు ఎపిసోడ్ లో డిమోన్ పవన్ మదర్, కళ్యాణ్ వాళ్ళ మదర్ అడుగుపెట్టినట్లుగా తెలుస్తుంది. మరి ఫ్యామిలీ వీక్ అంటే పది వారాలుగా ఫ్యామిలీకి దూరమైన హౌస్ మేట్స్ తమ కుటుంబ సభ్యులను చూడగానే భావోద్వేగానికి గురవుతూ ఉంటారు. అదే ఈ వారం హౌస్ లో హైలెట్ అవ్వబోతుంది.