దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన రీసెంట్ గా వారణాసి మూవీ టైటిల్ రిలీజ్ ఈవెంట్ లో తనకు దేవుడి పై నమ్మకం లేదు అంటూ తన తండ్రి గారు హనుమంతుణ్ణి బాగా నమ్ముతారు, నా భార్య హనుమంతుడిని ఫ్రెండ్ లా భావిస్తుంది అంటూ చేసిన కామెంట్స్ పై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి.
హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయని సరూర్ నగర్ పోలీసులకు రాష్ట్రీయ వానరసేన ఫిర్యాదు చేసింది. రాజమౌళిపై కేసు నమోదు చేసి ఫ్యూచర్ లో ఎవరూ హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని వానరసేన సంఘం సభ్యులు పోలీసులను కోరినట్లుగా తెలుస్తుంది.