బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశలోకి ఎంటర్ అయ్యింది. 10 వ వారం అనూహ్యంగా నిఖిల్ డబుల్ ఎలిమినేషన్ లో బలైపోగా.. గౌరవ్ కూడా ఈవారం అదే డబుల్ ఎలిమినేషన్ లో బయటికి వెళ్ళిపోయాడు. దివ్య ఎలిమినేట్ అవ్వాల్సి ఉన్నా ఆమెను ఉంచి నిఖిల్ ని బలి పశువును చేసారు. ఇక ఈవారం కుండ బద్దలు కొట్టే నామినేషన్స్ హౌస్ ని అతలాకుతలం చేసాయి.
ముఖ్యంగా ఇమ్మాన్యుయేల్ ని భరణి నామినేట్ చెయ్యడం, కళ్యాణ్ ని పవన్ నామినేట్ చెయ్యడం, మరీ ముఖ్యంగా డిమోన్ పవన్ రీతూ ని టార్గెట్ చేస్తూ నామినేషన్స్ లోకి తీసుకురావడం, ఆతర్వాత వారి మధ్యన పెద్ద గొడవ జరగడం అన్ని ఈ వారం నామినేషన్స్ లో హైలెట్ అయ్యాయి.
ఇమ్మాన్యుయేల్ రీతూ, భరణి ని నామినేట్ చేసాడు. దివ్యని రీతూ, రీతూ దివ్య ను నామినేట్ చేసుకోవడమే కాదు వీరి మద్యన పెద్ద వాగ్వాదం జరిగింది. సంజన అలాగే కళ్యాణ్ కి కూడా ఈ వారం నామినేషన్స్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఇక సుమన్ శెట్టి మొదటిసారి రెచ్చిపోయి కళ్యాణ్ ని నామినేట్ చెయ్యడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈవారం కుండపగలగొట్టి నామినేషన్స్ పెట్టడమే కాదు ఆ నామినేషన్స్ ను కెప్టెన్ తనూజ డిసైడ్ చేసే పవర్ ఇచ్చారు.
ఈవారం అంటే 11 వ వారం నామినేషన్స్ లోకి వచ్చిన వారిలో రీతూ, దివ్య, డిమాన్ పవన్, కల్యాణ్, ఇమ్మూ, భరణి నామినేషన్స్ లోకి రాగా కెప్టెన్ గా సేవింగ్ పవర్ తో తనూజ తన ఫ్రెండ్ కళ్యాణ్ ని కాకుండా రీతూ ని సేవ్ చెయ్యడం మరింతగా హాట్ టాపిక్ అయ్యింది.